నేటిధాత్రి నిజామాబాద్ జిల్లా :
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
నేషనల్ హైవే వద్ద నరేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రముఖ విద్యావేత్త అయిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ని పట్టబద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కరీంనగర్ లో జరిగే నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ….
కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ బరిలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రాడ్యుయేట్లు తనకు అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార గంగారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్ లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.