
-కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు
-కాంగ్రెస్ పార్టీ లో చేరిన వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి లక్ష్మి- మధు
-బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు పట్టించుకున్న నాధుడే లేడు
-ప్రేమ ఆప్యాయతలకు అభివృద్ధికి నిలువెత్తు రూపం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
-కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం 25 వార్డుకు చెందిన గూడూరి లక్ష్మి- మధు సుమారు 100 మందితో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు.
25 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.