బిజెపి అభ్యర్థి ఆరూరి గెలుపుకై భారీ ర్యాలీ.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం జూకల్ గ్రామం నుండి చిట్యాల మండల కేంద్రం వరకు బిజెపి నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ఈ సందర్భంగా
అరూరి రమేష్ మాట్లాడుతూ*.బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించండి.ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, కేంద్ర ఎన్నికలు ఆలోచించి ఓటు వేసి మోడీ ని మళ్లీ కేంద్రంలో అధికారంలో ఉంచాలి.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎప్పుడు అల్లర్లు, బార్డల్లో లొల్లిలు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు ఉండేవి.మోడీ ప్రధాన మంత్రి అయ్యాక దేశం అన్నిట్లో అగ్రగామిగా నిలిచింది.కరోనా సమయంలో దేశ ప్రజలు ఇబ్బంది పడోద్దని ఉచిత వ్యాక్సిన్ లు పంపిణీ చేసి ప్రజలకు అండగా ఉన్నారు.చిట్యాల మండలంలో పేద ప్రజలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాలు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా.నేను వర్ధన్నపేట నియోజకవర్గంను 10 సంవత్సరాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపాను.అదే విధంగా వరంగల్ పార్లమెంట్ ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది.భూపాలపల్లి చీరకాల కోరిక రైల్వే లైన్ తీసుకొని వస్తాను.ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కీల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను.నాపాక మరియు కోటంచ ఆలయాలను టూరిజం కింద అభివృద్ధి చేస్తాను..కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిగా విఫలమైనవి.రాష్ట్రంలో బిజెపి – మోడీ హవా కొనసాగుతోంది.మీ అమూల్యమైన ఓటు బీజేపీ కమలం పువ్వుకి వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిదర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మరావు, రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంటా రవి, పార్లమెంటరీ ప్రబారి మురళిధర్, పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి, అసెంబ్లీ కన్వీనర్ రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!