శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం.
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ దగ్గర శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిర్ నిర్మాణానికి గురువారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పరమ శివుడే సాయిబాబాగా అవతరించి సమస్త మానవాళికి సద్గురువై మానవ ప్రయోజనాలు పరిరక్షించుటకై ఊరు ఊర పల్లె పల్లెల్లో సాయిబాబా ఆలయాలు ఉన్నాయి.శాయంపేట గ్రామంలో కు చేరుకొనుటకు వరంగల్ నుండి రామప్ప లక్నవరం మేడారం వెళ్లే దారిలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు నుండి దారి 4 కిలోమీటర్లు ఉంటుంది మరియు వరంగల్ నుండి పరకాల కు వెళ్లే దారిలో మాంధారిపేట స్టేజి నుండి 2కిలోమీటర్లు ఉంటుంది దీనికి రోడ్డు సౌకర్యం కలదు. బాబా ఆశీస్సులు సమస్త ప్రజలు పొందడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, ఉద్యోగము, పెళ్లిళ్లు, ఇల్లు నిర్మాణం వంటి బాబా కృప వలన జరుగుతుంది.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గ్రామంలోని గాంధీ చౌక్ సర్కిల్ లో శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కందగట్ల రవి, ఉపాధ్యక్షులు మామిడి రమేష్, ప్రధాన కార్యదర్శి గన్ను వేణు, సంయుక్త కార్యదర్శి సామల రవీందర్, కోశాధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్, మాజీ సర్పంచ్ బాసాని శాంతా రవి, నాయకులు దుబాసి కృష్ణమూర్తి, మారపల్లి రవీందర్, మార్కండేయ పాల్గొన్నారు.