చందుర్తి, నేటిదాత్రి:
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శనివారం 10 వార్డులో ఎస్సీ కాలనీలో నాగం కుమార్ జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ. మల్యాల గ్రామంలోని 10 వార్డు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి, గొట్టే ప్రభాకర్ ,మల్లారపు రాజయ్య,నగరం శంకర్,లక్కె బాబు, మల్లారం కిషన్, లింగాల రవి,పొంచెట్టి వెంకటేష్, లక్కే సుదర్శన్, పత్తిపాక శంకర్, నేదురి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.