
Bhoomi Pooja for Cattle Shed in Anegunta
ఆనేగుంటలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామంలో 2025 పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బిక్షపతితో పాటు మండల అభివృద్ధి అధికారి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వివరాలను ఎంపీడీఓ మహేందర్ రెడ్డి వెల్లడించారు.