భూపాలపల్లిలో భోగి మంటలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి భోగి పర్వదినం సందర్భంగా భోగిమంటలు వేసి భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ఆనందోత్సవంలో నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముంగిళ్లలో రంగువల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. రేగుపళ్లు, నవధాన్యాలు కలిపిన నీటితో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకల్లో మునిగితేలారు. ఈ పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు
