బిజెపి పట్టణ అధ్యక్షులు వేముల అశోక్..
రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 10, (నేటిధాత్రి)
బహుభాషా కోవిధుడు, రాజకీయ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. భారతరత్న అవార్డు ప్రకటించడంతో దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. శనివారం క్యాతనపల్లి మునిసిపాలిటీ బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వేముల అశోక్, రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్ లు పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ…. పీవీ నరసింహారావు దేశాన్ని ప్రగతి బాట పట్టించిన అపార మేధావి అని, తెలంగాణ ముద్దుబిడ్డ అని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పార్టీల లతో సంబంధం లేకుండా పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలను గుర్తించి భారతరత్న పురస్కారంతో గౌరవించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అక్కల రమేష్, సత్యనారాయణ, వైద్య శ్రీనివాస్, కుమ్మరి మల్లన్న, ఊషన్న తదితరులు పాల్గొన్నారు.