ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం శ్రీ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా భాగ్యరెడ్డి వర్మ సేవలను స్మరించుకున్నారు.
