
నర్సంపేట,నేటిధాత్రి :
స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిమొగిలిచర్ల సందీప్,పిడీఎస్యు డివిజన్ అధ్యక్షులు కొమ్ము కరవి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ 117 వ జయంతిని పురస్కరించుకొని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ చింతకుంట్ల వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.అనంతరం మొగిలిచర్ల సందీప్,కొమ్ముక రవి మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయసులో దేశ స్వాతంత్రం కోసం ఊరికాంబాన్ని ముద్దాడిన గొప్ప మహనీయుడని అలాంటి మహనీయుని యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో అందరికీ విద్యా ఉపాధి కలగాలని లక్ష్యంతో పోరాడుతామని తెలిపారు.భగత్ సింగ్ యొక్క అడుగుజాడల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ జయంతి కార్యక్రమంలో కాలేజీ యుఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సాత్విక్ ,రాజు,వెంకటేష్,మహేష్,రాణి, సమత,మమత,సరిత,రాజేందర్, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.