భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్*
డిసెంబర్ 16 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరిగే పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ( ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్) మోడెం వంశీ ఎంపికైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపవర్ లిఫ్టింగ్ జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి మాట్లాడుతూ, గతంలో మోడెం వంశీ మాల్టా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో మరియు సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకాలు సాధించడమే కాకుండా స్ట్రాంగ్ మెన్ టైటిల్ ను కూడా గెలుచుకోవడం జరిగింది.ఈ పోటీలకు ఎంపికైన మోడెం వంశీని, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు వి మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ, జీవి రామిరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కోశాధికారి, మహంతి వెంకటకృష్ణాజి (సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టర్) పట్టణంలోని పలు క్రీడా సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, పట్టణ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి, సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారులు అభినందించడం జరిగింది.