భద్రాచలం నేటి ధాత్రి
పేదల పెన్నిధి, నిత్యం ప్రజా సేవకు అంకితం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సేవలు
దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామంలో ప్రాథమిక వైద్య శిబిరాన్ని సందర్శించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ
హాస్పిటల్లొని డాక్టర్లతో మాట్లాడి పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా చుడాలని ఆదేశించారు
సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్లను కలిసి సమస్యకు తగ్గ వైద్యం చేయించుకోవాలని తెలియజేశారు
వైద్యం పరంగా నిత్యం ప్రభుత్వ ఆసుపత్రులను పర్యటిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. గిరిజనులు గిరిజనేతరులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి అభినందనలు తెలియజేస్తున్నారు
ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, నాయకులు లంక అబ్బులు , మట్టా శివాజీ, దర్శి సాంబశివరావు మరియు గ్రామ యువకులు, అంగన్వాడి టీచర్ పూసం రత్నవలి, పోనెం వీరమ్మ, కారం అలివేలు, మొర్రం లక్ష్మి , మీడియం సమ్మక్క, ఏ ఎన్ ఎం పుసం భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు