
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం కునవరం రోడ్ నందు కరకట్ట నిర్మణ పనులు జరుగుతుండగా పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతుండగా వారికి నష్ట పరిహారం చెల్లించాలని కోరగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హైదరాబాద్ లో ఉన్నారు. వారి సమస్యలను స్థానిక నాయకులు రత్నం రమాకాంత్ ఫోన్ ద్వారా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సంఘటన స్థలానికి పర్యవేక్షరించమని తెలియజేశారు. అధికారులు ఫోన్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు కి రైతుల సమస్యలను వివరించగా స్థానిక శాసనసభ్యులు రెండు రోజుల్లో భద్రాచలం చేరుకొని సంఘటనా స్థలానికి వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. దీనితో రైతులు వారి పనులు ప్రారంభించుకోమని కరకట్ట నిర్మాణ కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన తెల్లం వెంకట్రావు కి సంబంధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు…