
అపరిచిత లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచన
పరకాల సీఐ క్రాంతికుమార్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కొన్ని గ్రూపులలో కొంతమంది అపరిచిత వ్యక్తులు(హ్యాకర్స్) పిఎం కిసాన్ అనే యాప్ పేరుతో లింక్ లను ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని అది ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే ఫోన్ హ్యాక్ అవుతుందని పరకాల ప్రాంత ప్రజలు తెలియని లింక్లు ఏమైనా వస్తే ఓపెన్ చేయద్దని మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయే అవకాశాలు ఉన్నాయని ఏదైనా ఫోన్ హ్యాక్ అయినట్టయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.