మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు
నడి కూడ,నేటిధాత్రి:
గత ప్రభుత్వం హయాంలో మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం నడికూడ మండల కేంద్రంలో ప్రాథమిక చికిత్స కేంద్రం( పీ హెచ్ సీ సెంటర్) ను సాంక్షన్ చేయించడం జరిగిందని నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు తెలిపారు. ప్రారంభోత్సవ సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున శంకు స్థాపన పనులు మధ్యలోనే ఆగిపోయాయి.దీనిని ఆసరాగా తీసుకున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని పీ హెచ్ సీ ని తరలించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం అందడంతో దీనిపై పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నడికూడ మండల కేంద్రంలో పి హెచ్ సీ సెంటర్ ను పునరుద్ధ రించాలని దీనివలన మండల కేంద్రంలోని 14 గ్రామాల ప్రజలు అత్యవసర వైద్య సేవలు, ప్రాథమిక చికిత్సలు అందు తాయని సూచించారు.