బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి సిఓఈ లో ఐఐటి నీట్ మెటీరియల్ పంపిణి
నేటిదాత్రి బెల్లంపల్లి
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ)బెల్లంపల్లి విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. అనంతం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. మీరు సాధించే విజయాల ద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట మరింత పెరుగుతుందని విద్యార్ధులను ఉత్సాహ పరిచారు. ఈ విద్యా సంవత్సరం పలు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో విద్యార్ధులు చూపిన ప్రతిభ అత్యును గతంలో ఉన్నత విద్యా అవకాశాలు సాధించిన వివరాలను ప్రిన్సిపల్ ఐనాల సైదులు ఎమ్మెల్యే కు వివరించగా ఎమ్మెల్యో ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని సాధించాలని ఆయన అబిలషించారు.
ఈ సందర్భంగా కళాశాలలో కావలసిన అదనపు తర్వాత గదులు ఇతర సౌకర్యాల విషయమై ప్రిన్సిపల్ పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ కళాశాలలో కావలసిన సౌకర్యాలు ప్రాధాన్యత అంశలను బట్టి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్,నాతరి స్వామి ,పేరెంట్స్ కమిటీ గౌరవాద్యక్షులు దాగం తిరుపతి,అధ్యక్ష కార్యదర్శులు పుదారి నగేష్ గౌడ్,గోగర్ల రమేష్ సూపరింటిండెంట్ అవదూత రాజశేఖర్,పేరెంట్శ్ కమిటీ సభ్యులు ఇప్పరవి,అడ్డూరి వెంకటస్వామి,వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్,జెవిపి పొన్నం శ్రీనివాస్,ఉపాధ్యాయులు యండి కౌసర్, కె.రాజేశ్వర్,దత్తప్రసాద్,గణపతి,విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.