నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణానికి చెందిన సమాజ సేవకుడు,స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్ కు అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ బెకానే ఆఫ్ ఎంపవర్మెంట్ – 2024 అవార్డు వరించింది.ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ,ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ల ఆధ్వర్యంలో ప్రపంచ మానవ బాలల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా హన్మకొండ అసుంత భవన్ లో జరిగిన కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ డీసీపీఎన్ రవికుమార్ అవార్డును అందజేశారు. ఈ అవార్డును మానవ,బాలల అక్రమ రవాణా నివారణ,బాల్య వివాహాల నిలుపుదల,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,బాలలపైన లైంగిక వేధింపుల నివారణ అలాగే బాలల రక్షణ,సంరక్షణల కొరకు కృషి చేస్తున్నందులకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్బంగా సామాజిక సేవకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ బాలల నిరంతర సేవలకు, బాలల సమగ్ర రక్షణకు తన వంతు నిరంతర కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ,సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్,ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ వసుధ,హన్మకొండ ఛైర్పర్సన్ అనిల్ చందర్ రావు,ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ కోఆర్డినేటర్ వేణుగోపాల్,వరంగల్ ఉమ్మడి జిల్లాల స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.