BC Reservations Negligence Sparks Outrage
బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం:
◆:- పరమేశ్వర్ పటేల్ ఆరోపణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ తాజా సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేశారని, పాత పద్ధతిలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పలుకుబడితో బీసీలను అణిచివేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
