
ఎంపీపీ, ప్రకాష్ రావు,
,వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి
బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు వెంకటనర్సయ్య
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలం లోని అశోక్ నగర్ గ్రామం లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణి చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పడినుండి తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి సంవత్సరం, బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిన చేస్తున్నారు అదే క్రమంలో శుక్రవారం పంపిన చేసారు. అనంతరం గృహలక్ష్మి ప్రొసీడింగ్ లెటర్స్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ, ప్రకాష్ రావు,వైస్ ఎంపీపీ,ఉమా రాణి, ఉపేందర్ రెడ్డి, మండలం వెంకట నర్సయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు యాదగిరి రావు, గ్రామ సర్పంచ్ కవిత రవి, వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రాష్ట్రo అభివృద్ధి లో నెంబర్ 1 అన్నారు. ముఖ్య మంత్రి కెసిఆర్ అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వం పథకాలు ఇస్తున్నారు అన్నారు ఎవరికి ఎక్కడ కాని ఏటువంటి లంచాలు లేకుండా వారి అకౌంట్లోనే పడుతున్నాయి, మధ్య దాళారీలు లేరు అని అన్నారు. అలాగే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వంమే అని మళ్ళీ గెలిచేది సీఎం కెసిఆర్ సార్ అని నర్సంపేటలోకూడా ఏమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని గెలిపించాలని వారిని ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపీటీసీ నాగేశ్వర్ రావు, ముఖ్య నాయకులు కర్ర రమేష్,కష్టాలు రమేష్, ఎం రవి,పంచాయతీ కార్యదర్శి జనార్దన్ ఉప సర్పంచ్ రాములు,వార్డ్ నెంబర్లు సంపత్, రాంబాబు, మరియు జనగం ప్రవీణ్ కుమార్, జాడి కిరణ్, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నోముల నరేష్,మహిళలు రమ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు