
Engili Pula Bathukamma in Bellampalli
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ
ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు సంబరాలు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి లో బాబు క్యాంప్ బస్తి సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి
ఈ సమయంలో వర్షాకాలం చివరి దశ, శీతా కాలం ప్రారంభం అవుతున్న వేళలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని, రమనీయమైన, కనువిందులు చేసే వివిధ రకాల పూలతో ప్రకృతి పులకిస్తుంది. తెలంగాణాలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయ చిహ్నం. మహిళలు అందరూ కలిసి రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఎంతో ఉత్సహంగా, ఘనంగా జరుపుకుంటారు.పూలనే రాశి పోసి పూజించే గొప్ప సంకృతి మరెక్కడా లేదని, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ వారు బతుకమ్మ ఆడుటకు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.