బాటసారులకు బాసటగా చలివేంద్రం
చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్ అన్నారు. బుధవారం వరంగల్ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు తోట హైమావతి, భూమయ్య గత 8సంవత్సరాలుగా చలివేంద్రం వేసవికాలంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడెపు రవీందర్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారులకు చవివేంద్రం బాసటగా ఉంటుందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చాలామంది బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు రచయిత, దర్శకుడు టి.వి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎండాకాలంలో దాహార్తులు మంచి పరిశుభ్రమైన నీటిని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, కనీసం ఎక్కువ నీటిని సేవించాలని అన్నారు. భూమయ్య, హైమావతిలు మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడం ఎంతో తృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సరళాదేవి, ఉషారాణి, రాజేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, శ్రీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.