భద్రాచలం నేటి ధాత్రి
ప్రీ గ్యాస్ కొందరికి కాదు అందరికీ ఇవ్వాలి
సిపిఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్
ఈరోజు దుమ్ముగూడెం మండలం పాత నారాయణపేట 8వ శాఖ మహాసభ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కూరం వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ పోడు భూముల పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, భూములకు త్రీఫేస్ కరెంటు సౌకర్యం కల్పించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని అన్నారు, ఫ్రీ గ్యాస్ కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటు అని అరులైన పేదలందరికీ ఫ్రీ గ్యాస్ అందే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, మరియు గత ప్రభుత్వం 2016 నుండి 2021 వరకు తునికాకు బోనస్ కొందరికిచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తునికాకు బోనాలను విడుదల చేయాలని లేదంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతామని హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కూరం వీరభద్రం, నూతన శాఖ కార్యదర్శిగా ఎన్నికైన కొమరం వీర్రాజు, మాజీ శాఖ కార్యదర్శి ఉయిక వీరభద్రం,కూరం వెంకన్న బాబు, నాగరాజు, మడకం జోగారావు, పెనుబల్లి రాజు, ప్రసాద్ ఇంకా తదితరులు పాల్గొన్నారు