కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నీట్, నెట్ పరీక్షల లీకేజీ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాలు మండలంలో గల ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలను బై కాట్ చేసి బందును సాఫీగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు మారపెల్లీ రఘువర్మ మాట్లాడుతూ ఎన్ టి ఏ ను రద్దు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపై పార్లమెంట్ మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరారు లీకేజీ తో విద్యార్థులు నష్ట పోయారని వారికి న్యాయం జరగాలి. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మండలం ఉపాధ్యక్షుడు కొమ్ముల వెంకటేష్, బిట్టు, కోల లక్ష్మణ్ ,సన్నీ, చరణ్ ప్రణయ్ మండల కమిటీ పాల్గొనడం జరిగింది.