
దేశంలో ఫ్యాసిస్ట్ తరహా పాలన సాగుతుంది
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పతనం ఖాయం
*
భద్రాచలం నేటి రాత్రి
విజయవంతమైన కార్మిక సార్వత్రిక సమ్మె-గ్రామీణ బంద్*
బంద్ కు సహకరించిన వ్యాపార వర్గాలకు, సంస్థలకు అఖిలపక్ష పార్టీల ధన్యవాదాలు
—————————————-
కేంద్ర బిజెపి ప్రభుత్వంలో అందిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతాంగ ,ప్రజా వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ భద్రాచలం పట్టణంలో విజయవంతంగా ముగిసింది. తెల్లవారుజాము నుండి అఖిలపక్ష పార్టీ నాయకులు బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. పట్టణంలో వ్యాపార సంస్థలు, హోటల్లు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు,చిరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంధ్ పాటించి సహకరించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఐ భద్రాచలం నియోజకవర్గం నాయకులు రావులపల్లి రవికుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్కె అజీమ్, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా నాయకులు కెచ్చెల కల్పన లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు, సంస్థలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 కోడ్ లు తీసుకువచ్చి కార్మిక హక్కులను నీరు కార్చే కుట్ర చేస్తుందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, విదేశాలలో మూలుగుతున్న నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ప్రతి పేదవాని ఖాతాలో 12 లక్షల రూపాయలు వేస్తానని, రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేస్తానని హామీలు ఇచ్చిన నరేంద్ర మోడీ ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఢిల్లీ వచ్చిన రైతులపై కేంద్ర ప్రభుత్వం నీటి పిరంగులు ప్రయోగించడం, భాస్వవాయువులు, రబ్బరు బుల్లెట్ల కాల్పులు చేయడం, రోడ్లపై మేకులు కొట్టి తీవ్ర నిర్బంధం ప్రయోగించి దేశద్రోహులు లాగ రైతులను రాజధానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేకత నుండి బయటపడేందుకు అయోధ్య రామ మందిరం అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని అన్నారు. మతాన్ని రాజ్యంలో ఛోప్పిస్తూ భారత లౌకికస్ఫూర్తిని దెబ్బతీసిందని అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విగాతం కలిగిస్తోందని అన్నారు. కేంద్ర బిజెపి భారత రాజ్యాంగాన్ని హేళన చేస్తుందన్నారు. పౌర హక్కులు మృగ్యమైపోయాయని విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనను ప్రశ్నించిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపుతూ తీవ్ర నిర్బంధాలు ప్రయోగిస్తూ ఫాసిస్టు తరహా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆదాని అంబానీ మొదలగు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బిజెపికి నేడు జరిగిన భారత్ బంద్ కనువిప్పు కావాలని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పతనం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, కే బ్రహ్మచారి సీనియర్ నాయకులు బిబిజి తిలక్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి బండారు శరత్ బాబు, వై వెంకట రామారావు, ఈ సంతోష్ కుమార్, ఎన్. నాగరాజు, కాంగ్రెస్ నాయకులు సరేల్ల నరేష్, బుడగం శ్రీనివాస్, అడబాల వెంకటేశ్వర్లు, తంబళ్ల వెంకటేశ్వరరావు, సరెల్ల వెంకటేష్, వరుణ్, చింతిరాల సుధీర్, ఎడారి ప్రదీప్, సిందా, సిపిఐ నాయకులు ఎస్ కే బి నాయుడు, మా రెడ్డి శివాజీ, ఏపూరి వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, కొండబాబు భాస్కరరావు, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులు శివకుమార్, ఐద్వా నాయకులు డి సీతాలక్ష్మి, ఎం లీలావతి, జీవనజ్యోతి, గిరిజన సంఘం నాయకులు కుంజా శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, డివైఎఫ్ఐ నాయకులు డి సతీష్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సండ్ర భూపేంద్ర, మాల మహానాడు జిల్లా కార్యదర్శి దాసరి శేఖర్, దళిత సంక్షేమ సంఘం నాయకులు ముద్దా పిచ్చయ్య, మైనారిటీ నాయకులు మునాఫ్, షఫీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సావిత్రి, ఇతర కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు…