
మృతుల కుటుంబాలను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 వేల ఆర్థిక సాయం అందిస్తా.
ముఖ్యమంత్రి తో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూస్తానని.
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
శుక్రవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు సంఘటన పట్ల శనివారం మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. పోస్ట్ మార్టం గదిలోకి వెళ్లి అక్కడి మృతదేహాలపోస్టుమార్టం పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించి తీవ్ర దిగ్బంధన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.
నిన్న జరిగిన బాలానగర్ సంఘటనలో 5 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు.మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా కృషిచేస్తానన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 /- వేల ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడి వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూస్తానని అన్నారు. ఇప్పటికే మృతుల సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం కు పంపించామాని తెలిపారు.