
కూకట్పల్లి జూన్ 29 నేటి ధాత్రి ఇంచార్జీ
బాలాజీ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావుతో జిహెచ్ఎంసి అధికారులు జలమండలి అధికారులతో కలిపి ధనల క్ష్మి సెంటర్ నందు పార్కుబాలాజీ నగర్ పార్కు డ్రైనేజీలను పరిశీలించారు.
అనంతరం బాలాజీ నగర్ వార్డ్ కార్యాల యంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమా వేశంలో డివిజన్లోనూ పలు కాలనీలా ప్రజలు ఫిర్యాదు లేఖలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా పార్కు పనుల్లో జాప్యం జరుగు తుందని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు హెచ్చరించారు అనంతరం బాలాజీనగర్ డివిజన్లో ఎక్కు వ భాగం డ్రైనేజీ సమస్య ఉందని దానిని సరిగ్గా అధికారులు గుర్తించక పోవడం వలన సమస్యలు ఎక్కువగా అవుతు న్నాయని అధికారులు డ్రైనేజీ సమస్య పైన దృష్టి సారించి వీలైనంతత్వరగా డ్రైనేజీ పొంగిపొర్ల కుండ చూసే బాధ్యత తీసుకోవాలని అదే విధంగా జరుగితే రాబోయే కాలంలో ప్రజలు అనా రోగ్య భారీన పడే అవకాశం ఉందని సత్వరమే డ్రైనేజీ పనులు ప్రారంభించా లన్నారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధుల అంచనా తయారు చేయాలని అధికారు లను కోరారు.కావలసిన నిధులను తీసుకు వచ్చి డివిజన్ అభి వృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు,వాటర్ వర్క్ అధికారులు, మాజీ కార్పొరేటర్ బాబు రావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి వెంకటచౌదరి,డాక్టర్ వెంకట్రా వు,సుభాష్ గౌడ్,ఆరోగ్య రెడ్డి, పృథ్వి మరియు వివిధ కాలనీల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో…..