బడిబాట
మండలంలోని పాత్రపురం గ్రామంలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రపురం గ్రామ పంచాయితీలో శుక్రవారం అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ‘ప్రైవేటు బడి వద్దు…అంగన్‌వాడీ ముద్దు’, ఇంటింటికి అంగన్‌వాడీ అనే నినాదంతో పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని, ఉచితవిద్య, పోషకాహారంతోపాటు ఆరోగ్యంగా పిల్లల ఎదుగుదల ఉంటుందని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తులలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కష్ణార్జున్‌రావు, వార్డుమెంబరు కారం వెంకటలక్షి, సూపర్‌వైజర్ రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు విజయ శుషంతల, చుక్కమ రామకష్ణ, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.