బడే భాయ్..చోటేభాయ్ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తారు

కాంగ్రెస్,బీజేపీ లను నమ్మి ప్రజలు ఆగం కావొద్దు

ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

కమలాపూర్ మండలం శనిగరం లో రోడ్ షో

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోస పడుతున్నారని… మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి…ఢిల్లీలో బడే భాయ్ నరేంద్రమోదీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గములోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో సోమవారం రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని,గోదావరి నీళ్లను కృష్ణ నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తుందని అన్నారు.తెలంగాణ లోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి ఏమన్నా నరేంద్రమోదీ సొమ్ము కాదని అన్నారు.
గోదావరి నీళ్లను తమిళనాడు కు పట్టుకుపోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, గోదావరి నీళ్లు తమిళనాడు కు పోతే తెలంగాణ ఎడారి అవుతుందని,నీళ్లను కాపాడుకోవడానికి పార్లమెంట్ లో ప్రశ్నించే గళం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినైనా తనని గెలిపించాలని వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.తెలంగాణ లోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఉండాలి,కానీ తొమ్మిది పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని..ఇంకా 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఒక్క నవోదయ పాఠశాల తేలేక పోయారని అన్నారు.బీజేపీ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణ కు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.2014నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైన్, కరీంనగర్ లో 50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయించడం ప్రారంభించామన్నారు.
జాతీయ రహాదారులు కూడా తీసుకువచ్చానని పేర్కొన్నారు.కమలాపూర్
ఉప్పల్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఐదేల్లలో ఎంపీ గా ఉండి బండి సంజయ్ పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు.ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు..ఒక్క బడి కూడా తేలేదని విమర్శించారు.
రాబోయే తరాలు బాగుండాలి. .పిల్లల భవిష్యత్ కోసం కేసీఆర్ గారు ఆలోచన చేసి
33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి నూట యాబై రోజులు అవుతున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లకు ఒక్క సీఎం మారుతడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రద్దయ్యేది తెలీదు…
ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది తెలువదని నిశితంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!