
ఆందోళనకు దిగిన భాధిత కుటుంబ సభ్యులు
పరకాల నేటిధాత్రి(టౌన్) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రేగొండ మండలం రేపాక కు చెందిన బోగి సురేష్ లావణ్య దంపతుల కుమారుడు భోగి అక్షిత్(6) సంవత్సరాలు
గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని లిటిల్ స్టార్ హాస్పటల్ కు వెళ్లడం జరిగింది.పరకాల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయం లో పరిస్థితి విషమించడంతో వరంగల్ కు తరలిస్తున్న సమయం లో బాలుడు మార్గమధ్యలో మృతి చెందడంతో భాధిత కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.నిర్లక్ష్యం గా వ్యవహరించిన వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని వైద్యుని నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతిచేందాడని భాధిత తల్లిదండ్రులు ఆరోపించారు.