Ayyappa Deeksha Begins at Jharasangam
మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమయ్యాయి దీక్షలో సంగన్న స్వామి మాట్లాడుతు నేమ నిబంధనాలతో దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం. ఈ దీక్ష అద్వితీయమైన నియమాలతో రూపొందించింది. అయ్యప్ప దీక్షను పాటించే సమయమిదే. 41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ, నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులివి. తనువు, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అంటూ అయ్యప్ప సేవలో తరిస్తుంటారు. ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయి. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తాయన్నారు,
