
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ లో అయోధ్య పురి నుండి వచ్చిన అక్షంత లను ముదిగుంట హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేపించి గ్రామ ప్రజలకు గడప గడపకు రాముల వారి అక్షింతలను విస్తరణ, రామ మందిరం గురించి వివరణ హిందూ ధర్మం గురించి బోధించడం జరిగింది. అలాగే రాముల వారి శోభాయాత్ర ఏర్పాటుచేసి గడప గడపకు తిరిగి ముదిగుంట భక్త ఆంజనేయస్వామి ఆలయ కమిటీ తరఫున ఈ అయోధ్య పురి స్వాములవారి అక్షతలు, తీర్థప్రసాదాలు,అందరికీ అందించడం జరిగింది. మరియు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శోభ యాత్రలో పాలు పంచుకున్న భక్తులకు మరియు గ్రామ పెద్దలకు,ప్రజలకు,ప్రజా ప్రతి నిధులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వారి కృప ఎల్లవేళలా ప్రజల అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.