మలేరియా నివారణ, జాగ్రత్తలు సూచించిన డాక్టర్ లవ కుమార్!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండ పల్లి మండలం అంబారీ పేట గ్రామం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా.అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. లవ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ మాట్లాడుతూ , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మలేరియా కు అసలైన నివారణ అని,దోమ కాటు వల్ల వచ్చేటటువంటి మలేరియా జ్వరాలు వాటి నివారణ చర్యలు మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అందరికీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి.లవకుమార్ మరియు సూపర్వైజర్ రమణ వల్లి ,ఎం ఎల్ హెచ్ పి గణేష్ , ఏఎన్ఎం లు లావణ్య, బుచ్చమ్మ , చంద్రకళ ,విజయలక్ష్మి సునీత ,వినోద ,మరియు అరోగ్య సహాయకులు శ్రీను , మరియు ఆశా కార్యకర్తలు , ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నివారణ పై అవగాహన ర్యాలి!!
