కాటారం: నేటి ధాత్రి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల రెడ్డి అన్నారు. కాటారం మండలం గంగర గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో అధికారం చేపట్టి నుండి ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆయుష్మాన్ భారత్, ముద్ర లోన్లు, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన లాంటి పథకాలపై అవగాహన కల్పించారు. రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6000 రూపాయలు వారి ఖాతాలు జమ చేస్తున్నారని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసిన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అని అన్నారు. బిజెపిని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బంధం మల్లారెడ్డి, రాజిరెడ్డి, వెంకట్ గౌడ్, సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు….