
Agriculture
పురుగు మందుల చట్టంపై అవగాహన
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మొగుళ్ళపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారులకు(డీలర్లకు) రైతు వేదిక మొగుళ్ళపల్లి లో విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాలపై అవగాహన/సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఈ క్రింద సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని .
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా
ఎదురుగాపెట్టాలి. లైసెన్సు లేకుండా విత్తనాలు గాని, ఎరువులు గాని మరియు పురుగు
మందులు అమ్మకం చేయరాదు. డీలర్ యొక్క షాప్ పేరు, ఇంటి/డోర్ నెంబర్ మరియు ఇతర
వివరాలు పేయింట్ తో రాయాలి
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి. డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు
ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి.
కంపనీల నుండి వచ్చే సరుకులకు ఇన్వాయిస్ లేనిదే అమ్మకాల స్థలంలో లేదా గోదాముల్లో
దింసుకోనరాదు.బిల్లు మరియు డి.సి.లు లేనిదే స్టాక్ సరఫరా చేయరాదు.స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలి.బ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా నిల్వచేయాలి. డీలర్లు తామ యొక్క లైసెన్సు గడువు మీరినట్లైతే ఎటువంటి అమ్మకాలు జరపరాదు.డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు.లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.
స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి మరియు. అలాగే అన్ని గ్రామాల డీలర్లు, AEO లు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు