ముత్తారం :- నేటి ధాత్రి
హెల్త్ రిలేటెడ్ హిల్ నెస్ అండ్ సన్ స్ట్రోక్ ప్రోగ్రాంలో భాగంగా ముత్తారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ జరుగుతున్న ప్రదేశాలలో పని చేసే కూలీలకు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఆదేశాల మేరకు ఎండలో పని చేస్తున్నప్పుడు వారి యొక్క బాడీ డిహైడ్రేషన్ కాకుండా వారికి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి వాటిని లీటర్ నీటిలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలని ఎండకు పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు తలకి తెల్లని టవల్ కట్టుకోవాలని లూజ్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవాలని బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఓ ఆర్ స్ కలిపిన ద్రావన్ని కొంచెం కొంచెం త్రాగలని ఒక వేళ ఎవరికైనా వడ దెబ్బ లేదా బాడీ డీహైడ్రేషన్ ఐనా వెంటనే నీడ ఉన్న ప్రదేశం కి తీసుకవచ్చి వారికి గాలి అందేటట్లు చేసి ఓ ఆర్ ఎస్ ద్రావాణాన్ని త్రాగించి అవసరం అనుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు రెఫర్ చేయమని చెబుతూ అందరికీ సూచించారు ఆరోగ్య విద్య బోధన లో భాగంగా వడ దెబ్బ గురించి అవగాహన కల్పిస్తూ ఓ ఆర్ ఎస్ పాకెట్స్ వారికీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో ఏ ఎన్ ఎమ్ లు ఆశా కార్యకర్తలు జోష్ణ సుజాత శేషికల సరిత విజయలక్ష్మి జయ రాజేశ్వరి ఉయ్యాల రజిత రజిత కల్పన లత సంధ్య స్వప్న విజయ సరిత జ్యోతి శశికల మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు