సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన

గొల్లపల్లి నేటి దాత్రి:

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్వా కోడూర్ గ్రామంలో పోలీస్ వారు నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు, గంజాయి నివారణపై అవగాహన, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, సీసీ కెమెరాలు యొక్క ఆవశ్యకత గురించి జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్లయితే 1930 నంబర్ కి ఫిర్యాదు చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోందని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కు సహకరించాలని గ్రామస్తులను కోరారు. తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని ప్రభుత్వం పోలీస్ తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. వాహనదారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనబడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్నచిన్న తగాదాలకు పోయి జీవితం చేసుకోవద్దని, నేర రహిత గ్రామాలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలని సూచించారు. మంత్రాలు తంత్రాలు మూఢ నమ్మకాలు నమ్మవద్దని గ్రామాల్లో ఏ సమస్య ఉన్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు. లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ , పోలీస్ సిబ్బంది, పోలీస్ కల బృందం సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!