
జమ్మికుంట: నేటిధాత్రి
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షణ కవచం కిట్లను ప్రవేశపెట్టింది. జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి శివారులో తాటిచెట్ల వద్ద జమ్మికుంట ఎక్సైజ్ సిఐ మాధవి లత ఆధ్వర్యంలో రక్షణ కవచాలతో తాడిచెట్లు ఎలా ఎక్కాలి గీత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కాటమయ్య రక్షణ కవచ కిట్లను గీతా కార్మికులకు అందజేసి తాటి చెట్లు ఎక్కే విధానాన్ని ప్రత్యక్షంగా గీతా కార్మికుల సమక్షంలో అవగాహన కల్పించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ మాధవి లత మాట్లాడుతూ గతంలో గీతా కార్మికులు రక్షణ కవచాలు లేకపోవడం వల్ల తాటి చెట్ల నుండి జారిపడి తీవ్ర గాయాల పాలు కావడం గాని, మరణించడం గాని జరిగేదని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కీతా కార్మికుల కోసం ప్రత్యేకంగా కాటమయ్య రక్షణ కిట్లను అందజేస్తుందని గౌడ కులస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా చూసిన ఈ కిట్ల పనితీరును గురించి తోటి గీతా కార్మికులకు సైతం అవగాహన కల్పించాలని ఆమె కోరారు. కాటమయ్య రక్షణ కవచాలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెట్టు నుండి జారి పడిపోయే ప్రమాదాలు తగ్గుతాయని వెల్లడించారు.