
చిట్యాల, నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల రైతు వేదికలో మూడు మండలాలు మొగుళ్ళపల్లి టేకుమట్ల చిట్యాల అంగన్వాడీ టీచర్స్ కు ఎలక్షన్ డ్యూటీ లపైన అవగాహన సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు మరియు చిట్యాల ఎంపీడీవో జయశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ రోజు టీచర్స్ అందరూ పోలింగ్ బూతుల వద్దకు వెళ్లి దివ్యాంగులైన వృద్ధులైన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరితో ఓటు వేయించాలని, వా రిని వరుసలో ఉంచకుండా వచ్చిన వెంటనే అవసరమైన వసతులు మంచినీళ్లు వీలుచెర్ల లొ తీసుకు వెళ్లడం చేయాలని సూచించారు, ఈ సమావేశమునకు ఐసిడిఎస్ సిబ్బంది హాజరై గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరి నారు, ఈ కార్యక్రమంలో సరోజ రజిత మాధవి జయప్రద సూపర్వైజర్స్ వెంకటస్వామి తిరుపతి ఐసిపిఎస్ నుండి మరియు మూడు మండలాల అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు.