avirbava dinostavanni jayapradam cheyali, ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు పుట్ట రవి అన్నారు. శుక్రవారం హసన్‌పర్తి మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుట్ట రవి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంద కృష్ణమాదిగ పర్యటన సందర్భంగా ఉదయం 7గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలకేంద్రంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉదయం 11గంటలకు, ములుగు జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2గంటలకు, జనగామ జిల్లాలో 5గంటలకు మంద కృష్ణమాదిగ పర్యటన అన్ని జిల్లాలలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఈమామూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 25లక్షల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 25సంవత్సరాల ఉద్యమస్ఫూర్తి అట్టడుగు పేదల స్ఫూర్తిదాయంగా ఎమ్మార్పీఎస్‌ నిలిచిందని అన్నారు. ఇంటికి ఇద్దరు, పల్లెకు 2వాహనాల చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారపు బిక్షపతి, మండల అధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్‌, నాయకులు రామంచ సంపత్‌, కేతపాక సదానందం, పలనాటి రవీందర్‌, రాజు, జనార్థన్‌, ప్రసాద్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!