
*మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్ర కు చోటు*
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా…