
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఆరె కుల బంధువులకు నూతన సంవత్సర క్యాలెండర్ అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హింగే శివాజీ మాట్లాడుతూ ఆరెకుల ఐక్యత కోసం హనుమకొండ జిల్లా కమిటీ కృషి చేస్తుంది అందులో భాగంగా ఇంటింటికి ఉచిత క్యాలెండర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో ఆరె కులస్తులు ఎంతో సాధారంగా ఆహ్వానించడం జరుగుతుంది అని తెలియజేసినారు. ఆరె కుల సమస్యలను సాధించుకోవడానికి ఏ పిలుపు ఇచ్చిన కులస్తులందరూ తరలిరావాలని అన్నారు.జిల్లా ముఖ్య సలహాదారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ ఆరె కులానికి ఓ బిసి సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. రాష్ట్ర నాయకుల కృషితో ఓబీసీ సమస్య తుది అంకానికి చేరినది. ఆ సర్టిఫికెట్ వచ్చేంతవరకు ప్రతీస్టాత్మకమైన IIT, NEET, IIM లాంటి ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థల అడ్మిషన్ , జాతీయ స్థాయి ఉద్యోగాలకు అప్లై చేసుకునే విద్యార్థులు స్థానిక తహసిల్దార్ నుండి EWS సర్టిఫికెట్ పొంది అప్లై చేసుకోవచ్చు. EWS సర్టిఫికెట్ కు ఆరెకుల విద్యార్థులు అర్హులని తెలియజేసినారు. ఏ మండలంలో అయినా అధికారులు ఆరె కులానికి ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వనట్లయితే జిల్లా కమిటీ సభ్యులకు,రాష్ట్ర కమిటీ సభ్యు లకు సంప్రదిస్తే ఇప్పించడం జరుగుతుందనితెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హింగే శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు, పేర్వాల లింగమూర్తి, రంపీస మనోహర్ రావు,లడే శివ, మండల అధ్యక్షులు దుర్నాల రాజు, ఎడ్ల బాబు రావు, గుండెకారి శ్రీనివాస్,ఇటుకాల పాపారావు, మోకిడే మహేందర్, దుర్నాల బాబురావు దుర్ణాల రాజేశ్వర్ రావు, రవీందర్,దుర్నాల వినయ్ కుసుంబ కిషన్ రావు తదితర కుల బంధువులు పాల్గొన్నారు.