
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీల్లో బాగంగా, ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కు నూతన ఇన్స్ స్పెక్టర్ గా సంతోష్ వచ్చారు. నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన సంతోష్, బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. నీజాయితీ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన ఇన్స్ స్పెక్టర్ కు తెలిపారు.