రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణం లోని మల్లికార్జున నగర్ లో నివాసముంటున్న గుడిసె కొమురయ్య ఇల్లు ఇటీవల కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన విషయం సోషల్ మీడియా ద్వారా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు తెలియడంతో సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ లో గుడిసె కొమురయ్య ఇంటికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి , సానుభూతిని తెలియజేస్తు ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భూమేష్
అధ్యక్షులు బి.లక్ష్మణ్ రావు,
ప్రధాన కార్యదర్శి కె. అశోక్ ,
వైస్ ప్రెసిడెంట్ ఏ.కుమార్,
ట్రేజరర్ టీ సురేష్, సభ్యులు బి.సంపత్, కె.సంపత్, యస్ మహేందర్, యస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.