అమ్మవారి మండపం వద్ద..

అమ్మవారి మండపం వద్ద..
భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి

 

దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యుత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాట్యమండలి చే దుర్గామాత మండపం వద్ద భరతనాట్యం కార్యక్రమం మరియు మ్యాజిక్ షో అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందన్నారు. నవరాత్రులు రోజుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో సంస్కృతి సంప్రదాయాలు నేటి యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే మూఢనమ్మకాలను నమ్మవద్దని మ్యాజిక్ షో నిర్వహించామని తెలిపారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version