కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తనయుడు దీక్షిత్, సతీమణి దీవెన బుధవారం కొడిమ్యాల మండలంలోని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు.చొప్పదండి లో మూడోసారి కూడా కారు గుర్తుకు ఓటేసి సుంకె రవిశంకర్ ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పుణుగోటి ప్రశాంతి, ప్యాక్స్ ఛైర్మెన్ మేనేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.