Aruri Ramesh Lost Political Credibility: Youth Congress Leader
అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు
ఓడించి ఇంటికి పరిమితం చేసినా బుద్ధి రాలే కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర అరూరిది
అన్న అంటే అందుబాటులో ఉంటున్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
లక్ష మేజారిటి అని గొప్పలు చెప్పుకున్న అరూరిని సోంత పార్టీ కార్యకర్తలే ఓడించింది నిజం కాదా..?
గ్రామాల్లో ఒక్క ఇళ్లు కూడా పెదలకు కట్టని అరూకి ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు
నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం
వర్ధన్నపేట ( నేటిధాత్రి):
లక్ష మెజారిటి గొప్పలకు పోయి కన్ను మీన్ను కానకుండా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను పక్కనబెట్టి అక్రమ సంపాదనకు పాకులాడి అభివృద్ధి మరిచి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడనే అరూరి రమేష్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసినా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం మారలేదని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు బీజేపి సంకలో ఉన్న అరూరికి అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కు తోచక బిఆర్ఎస్ పార్టీలో చేరిన అరూరి రమేష్ వాస్తవాలు మాట్లాడకుండా ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను, ఉద్యమకారులను కనీసం పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల మీద శ్రద్ద పెట్టి వందల కోట్ల రూపాయలు దండుకున్న అరూరి నేడు మున్సిపల్ ఓట్లు రాగానే కార్యకర్తలు రావడం ఆయన స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడారనే సొంత పార్టీ కార్యకర్తలే సాదారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ఏ స్వార్ధం లేకుండా కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకుంటే అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉండి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న పరిస్థితులను చూసి తట్టుకోలేకే తప్పుడు కూతలు కుస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే అరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడమే గాక బీఆర్ఎన్ పార్టీ కనుమరుగు గాక తప్పదని యాకాంతం అన్నారు. నియోజకవర్గంలో గత పదేళ్ల పాలనలో ఏ గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని అరూరి రమేష్ దమ్ముంటే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమౌతున్నాయో లెక్క పెట్టి బుద్ధి తెచ్చుకోవాలని యాకాంతం నూచించారు.
ఇప్పటికైనా అరూరి రమేష్ వాస్తవ విషయాలను మాట్లాడి మార్పు తేచ్చుకోకుంటే ఆయన వర్ధన్నపేట మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని యాకాంతం ధీమా వ్యక్తం చేశారు.
