ఏరియా జీఎం మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 23న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అధికారులకు ఆదేశించారు. గురువారం జీఎం కార్యాలయంలో ఏరియా లోని అన్ని గనుల డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ఆవిర్భావ వేడుకలలో అన్ని రకాల ఆహార స్టాల్స్, కంపెనీకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని , అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 18న ఉదయం 2:00 గంటలకు ఏరియా లోని సిఈఆర్ క్లబ్ లో మహిళలకు త్రోబాల్, బాంబే బ్లాస్ట్, బాల్ ఇన్ బాస్కెట్ పోటీలు,19వ తేదీన సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు దీపాలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, పోటీలలో పాల్గొనె మహిళలకు దీపాలలో నూనె సింగరేణి యాజమాన్యం ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. అలాగే దీపాలంకరణ పోటీలకు మందమర్రి ఏరియా సేవ అధ్యక్షురాలు సవిత మనోహర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి , రెండవ బహుమతులు తో పాటు 10 కన్సోలేషన్ బహుమతులు సింగరేణి డే రోజన ప్రదానం చేస్తామన్నారు. అలాగే పర్యావరణంతో అందంగా అలంకరించిన గృహాలను19వ తేదీన ఉదయం 10:00 గంటలకు సందర్శించి వాటిలో ఉత్తమ గృహాలను ఎంపిక చేసి వారికి మొదటి, రెండవ బహుమతులతో పాటు 5 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను ఈనెల 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు పర్సనల్ డిపార్ట్మెంట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. దీపాలంకరణ పోటీలలో పాల్గొనే వారు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 7013359316, 8688150431.లలో, ఉత్తమ గృహాల ఎంపికలో పాల్గొనేవారు 99899945472, 9491145233, సంప్రదించాలని, తినుబండారాల స్టాల్స్, ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారు జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్ లో వారి పేర్లను ఈనెల 20వ తేదీ లోగా నమోదు చేసుకావాలని సూచించారు. ఈ సమావేశంలో ఏరియా లోని అధికారులు తదితరులు పాల్గొన్నారు.