సభకు లక్షలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపు.
భూపాలపల్లి నేటిధాత్రి
(మంగళవారం) భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జన జాతర భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారని, ఇట్టి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం జన జాతర ప్రాంగాణంలో ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జనజాతర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇట్టి సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్ది డాక్టర్ కడియం కావ్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సరేఖ, ధనసరి అనసూయ సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షి, జాతీయ నాయకులు రోహిత్ చౌదరి తో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున, ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలిరావాలని అన్నారు. ప్రధాని మోదీని ఓడించి, రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్..
ఈరోజు ఉదయం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యులు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి సభా ప్రాంగాణంలో జరుగుతున్న ఏర్పాట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. సభకు వివిధ రూట్లలో వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేసి, చదును చేయాలని బాధ్యులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎస్సార్ వెంట పలువురు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు.