
భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు…
నేటి, ధాత్రి:-శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి తన ఇంటి నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, బంధువులతో కలిసి బైక్,కార్ల ర్యాలీతో మొదలై ఆల్విన్ చౌరస్తా మీదుగా తారానగర్ లోనితుల్జా భవాని టెంపుల్ చేరుకొని డప్పు మేళాలతో, వివిధ విన్యాసాలతో ఘనంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ విన్యాసాల నడుమ గాంధీకి ఘన స్వాగతం పలికారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, కార్పొరేటర్లు, ఇతర సీనియర్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేయడానికి ఊరేగింపుగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నెహ్రూ నగర్ ఆదర్శనగర్ కార్యకర్తలు క్రేన్ సహకారంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు కలిసి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ర్యాలీల తో చేరుకున్నారు. అనంతరం అరికెపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఆయన పాలనలో చేపట్టడం జరిగిందని తెలిపారు. కెసిఆర్ పాలనను ప్రజలు భ్రమరథం పట్టారని చెప్పారు. నీరు, విద్యుత్తు పారిశుద్ధ్యం, గ్రీన్ పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని గాంధీ చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 40 పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచామని అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ దేశ విదేశాల పర్యటించి రాష్ట్రంలో ఐటీ సంస్థలను ప్రోత్సహించి వేలాదిమందికి ఉద్యోగ అవకాశం కల్పించారని ప్రశంసించారు. రానున్న కాలంలో మరో లక్ష డబల్ బెడ్ రూమ్ లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు అదనంగా స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ హమీద్ పటేల్, మంజుల రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.