ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి

ఆసుపత్రి సమస్యల పై ఐద్వా , DYFI సర్వే

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి దారిశెట్టి సతీష్ బాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఐద్వా డివైఎఫ్ఐ భద్రాచలం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మి సతీష్ బాబులు మాట్లాడుతూ
.నాలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి అతి పెద్ద ఏరియా హాస్పిటల్ లో 76 మంది డాక్టర్స్ ఉండాలి కానీ ప్రస్తుతం 17 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారని అన్నారు. ఏజెన్సీ కేంద్రమైన ప్రభుత్వ ఏరియా హాస్పటల్లో 17 మంది డాక్టర్స్ సరిపోవటం లేదు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీకి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం గైనకాలజిస్ట్ డాక్టర్ ఒక్కరూ మాత్రమే ఉన్నారని ,ఆ డాక్టర్ ప్రస్తుతం ఉదయం మాత్రమే హాస్పటల్లో ఉంటున్నారని నైటు వచ్చిన డెలివరీ మహిళలు చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారని ఆరోపించారు.డెలివరీకి వచ్చిన మహిళలను కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి రామవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురిటి నొప్పులతో బాధపడే గర్భిణీ మహిళలు అక్కడికి వెళ్లాలంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వర్షాకాలం జ్వరాల సీజన్ ముఖ్యంగా డెంగ్యూ ,మలేరియా లాంటి విషపూ జ్వరాలకు సీజన్. ఈ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చి సరిపోను సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్పందించి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమస్యలను పరిష్కరించకపోతే మహిళా సంఘం డివైఎఫ్ఐ తో పాటు ఇతర ప్రజాతంత్ర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి ,జిల్లా నాయకురాలు ఎన్ లీలావతి, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి దారిశెట్టి సతీష్ బాబు, మాజీ టౌన్ నాయకులు సంతోష్ కుమార్ ,ఐద్వా ఆఫీసు బెర్రర్స్ రాదా, టౌన్ కమిటీ సభ్యులు డి కనక శ్రీ, నాగలక్ష్మి ,ఎస్కే ఆలీమా, వై పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *